|
|
Articles: Poetry | అధికార భవనం - Dr. rangarao raavi
| |
వాడు
కొండను పగలగొట్టాడు
చిన్న చిన్న రాళ్ళుగా...
వాడిమీద
ప్రతీకారంతో
ఆయుధాలై దూసుకొచ్చాయి
ఎన్నో కొనలున్న
చిన్న చిన్న రాళ్ళు...
మేధావి గదా మరి-
ముక్కలైన ఆ రాళ్ళను
తేలిగ్గా ఒడిసి పట్టుకొని
కులం సిమెంటుతో
అజ్ఞానం ఇసుకతో కలిపేసి
అధికార భవనం కట్టుకున్నాడు,
గుండె మీద చెయ్యేసుకొని
తృప్తిగా కునుకుతీస్తున్నాడు...
ఇప్పుడిక
అధికారమంటే
ఎప్పటికీ వాడి సొంతిల్లే,
అనుభవించేది వాడి వారసులే
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|