|
|
Articles: Poetry | ఆ రోజు - Site Administrator
| |
(బుచ్చిరెడ్డి)
ఒబామా గెలుపు
ప్రపంచ రాజకీయ చరిత్రలో ఓ మలుపు
ఆ రోజు
కెన్నెడీ -- మార్టిన్ లూథర్ కింగ్ లు
మళ్లీ పుట్టిన రోజు
నవతరం--యువతరం
కొత్తశకంతో
కొత్త చరిత్రతో
నాందీ పలుకుతున్న రోజు
చరిత్ర తిరిగి రాసుకునే రోజు
ప్రపంచానికి
కొత్తదనం తెలియపరిచిన రోజు
మార్పును గెలిపించిన రోజు
మంచిని నిలబెట్టుకున్న రోజు
రంగుతో పని లేదని
ప్రపంచానికి
చాటిచెప్పిన రోజు
ఆ రోజు
రోస్ పార్క్ బస్ లో
నాట్యం చేస్తున్న రోజు
మనిషి చంద్రమండలంలో
అడుకుంటున్న రోజు
వర్ణవివక్షను పాతరేసిన రోజు
ఇరాక్ యుద్ధానికి చరమగీతం పాడిన రోజు
దిగజారిపోతున్న డాలర్‌ను
నిలబెట్టుకున్న రోజు
క్రిస్ మాస్ -- థాంక్స్ గివింగ్
అన్నీ ఆ రోజే
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|