'క్షణం కూడా గడవటంలేదు '
అనే భావం...
నీ ఊహల ఉలికి చిక్కుకుని
ప్రాణం పోసుకుని
నా అణువు అణువూ
తడిమి తడిమి
ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
ఆ పులకరింతలలోని హాయి
నీ విరహంలోని బాధతో
కలబడి యుద్దం చేస్తూ
నా హౄదయాన్ని మరుభూమిగా
మార్చేసింది...
ఇవేమీ తెలియని నీవు
సుదూరతీరాల
చిరునవ్వులు చిందిస్తూ...
ఉడికిస్తున్నావు...