|
|
Articles: Poetry | అశ్రుపాతం - Mr. kompellaramakrishna murty
| |
మింటిపైన ఒక్క చుక్క
కంటికొసల ఒక్క చుక్క
ఒకటి అందరాని గాథ!
ఒకటి అంతులేని బాధ!
గుండెకూన ఏడిస్తే
కన్నుతల్లి కరుగుతుంది
ఒక వేదన రగిలినపుడు
కావ్యం జాల్వారుతుంది!
కన్నీరే మున్నీరై
ఉప్పెనలా ఎగసినపుడు
మనసులోన బడబానల
కీలలు రేగిన చప్పుడు!
ఆంతర లోకాలేవో
అశ్రువులై వెలికి వచ్చి
బహిర్లోక తైక్ష్ణానికి
ఆవిరులైపోతున్నవి!
కాలుజారి ఒక తారక
శూన్యంలో రాలుతుంది
కాగిన కన్నీటిచుక్క
అక్షరమై పేలుతుంది!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|