|
|
Articles: Poetry | అమ్మ యాది - Site Administrator
| |
(అన్వర్)
బతుకుని ఆత్మార్పణం చేసి
ప్రజల్ని కన్నబిడ్డల్లా ఒళ్ళో కూచోపెట్టుకొని
తిరిగే భూమి చుట్టూ
అమ్మ సమాజమై తిరిగింది
పాటొక్కటే జీవితంలో లేదేమో
తానే ప్రజల పాటైంది
ఎన్ని రాగాలో అమ్మ బతుకు నిండా
లవణం తన జీవితసారం
జాషువా తన యేహోవా!
ఈ ప్రజలు అమ్మ పిల్లలు
మహా కవి ఇంట మహాకావ్యమై వెలిగిన అమ్మ
లవణం బతుకు నిండా మమకారాలు నింపారు
ఇద్దరూ ఒకరికొకరు తోడుగా
ప్రజల ఉప్పునీరై బతుకుదారులై సాగారు
అమ్మ మనుషుల్ని ప్రశ్నగా చేశారు
జవాబుగా నిలబెట్టారు
దొంగల దారులు మూయించి బతుకుదారుల నడిపించారు
శకలాలు శకలాలుగా బతుకుతున్న బతుకుబొమ్మల్ని
మానవ సమూహాలుగా మలిచారు
బాధల్ని బాధలతోటే కొత్త అర్థాల్ని నేర్పి
కష్టాల్ని కష్టాలతోటే ఇష్టమైన బతుకును చేశారు
అమ్మ...
ఎప్పటికీ తడిగా తగిలే జ్ఞాపకం
వెచ్చగా తాకే స్ఫూర్తి
అమ్మ నడిచినప్పుడు నేలకు చెమటచుక్క
అమ్మ చేయి తగిలినపుడు మనిషికి ఆత్మీయ స్పర్శ
అమ్మ మాట మా గుండెల మీద చెరగని నిరంతర వ్రాత
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|