|
|
Articles: Poetry | అతి తొందరలోనే.. - Site Administrator
| |
(డా.ఉప్పు జయభారతి)
తుపాను ముందు ప్రకృతి ప్రశాంతత
నివురుగప్పిన నిప్పు చల్లదనం
అగాధాల సాగరం అలల సంగీతం
నిరాదరణకు గురైన అతివల అంతరంగం
ప్రకృతి తుపాను విలయతాండవంగా
నివురుగప్పిన నిప్పు అగ్నికీలలుగా
సాగర అలలు సునామీగా
పడతులు అపర కాళికలై విప్లవించక ముందే
చేయండి సామాజిక న్యాయం
ఇవ్వండి చట్టసభలలో సగభాగాన్ని
జాతినిచ్చే ఇంతులను పూబంతులుగా వాడనీకండి
వారు నేలకు కొట్టిన బంతులై
మహా విప్లవాగ్నిని రగల్చగలరు
అతివలందరూ ఆత్మప్రబోధంతో
అతి తొందరలోనే...
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|