|
|
Articles: Poetry | నానీలు - 42 - Miss kumari kumari
| |
భూమాతకు
ఇంపైన నైవేద్యం
ఎరువు - నీరు - విత్తనం..
ఖబర్దార్..కల్తీ వద్దు..
నారుమడి - చాతుర్యం
కుప్పనూర్పు - ఓర్పు
సేద్యంలో
రైతు వ్యక్తిత్వ వికాసం..
పంచభూతాలను
ఒడుపుగా వాడే
అపర చాణక్యులు
వ్యవసాయదార్లు
కన్నవారు -
బిడ్డలే కాదు..
పంట చేను - పాడి పశువూ
రైతు కుటుంబమే!
చనుబాలులా
సేంద్రియ ఎరువు
పంటకిస్తుంది..
రోగ నిరోధకం - ఆరోగ్యం
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|