|
|
Articles: Poetry | మౌనం - Miss kumari kumari
| |
పూల మౌనం - గుబాళించె పరిమళంగా
జాబిలి మౌనం - వెదజల్లె వెన్నెలగా
కడలి మౌనం - మురిపించె ముత్యంగా
నింగి మౌనం - విరిసె ఇంద్ర ధనుస్సుగా
నేల మౌనం - మొలకెత్తె, విత్తనం మొక్కగా
ఇందరి ఎందరి మౌనంతో
ఎదిగెనులె అందాల లోకం..
మరి మన మౌనం
ప్రశ్నల పరంపరకు - సమస్యల సుడిగుండాలకు
చేతలుడిగిన చేష్టా ?
అంతులేని వ్యధా?
బాధాకరమైన జవాబా?
విషాదమయ జీవన యాత్రా?
నిరాశ - నిస్పృహలకు నీరాజనమా?
కానే కాదు..
ఈ మన మౌనం.. కావాలి..
భగవంతుని ఆరాధనగా
ప్రశ్నలే లేని గమ్యం కోసం..
బ్రతుకొక చుక్కానిగా
జవాబే వెదకని జన్మ ధన్యత కోసం..
శాంతి - అహింసల పరంపరతో
మానవత్వం మనుగడగా
మనిషి 'మనిషి 'లా బ్రతికే రోజు కోసం..
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|