|
|
Articles: Poetry | శాడిజం - Hi soumya
| |
మనిషి మనిషికో కథ రాసి
ఎద ఎదకో వ్యధను చేర్చి
బొమ్మలాటగ చేసుకొని
విందు చేస్తుంటావేమో...
కర్త కర్మలను జోడించి
జనన మరణాల వలయాన్ని సృష్టించి
ఉపదేశాలు వల్లించి
సేద తీర్చుకుంటుంటావేమో...
జీవుల రోదనలు
మనుషుల ఆక్రందనలు
సుఖ దు:ఖాలు
కష్టాలు కన్నీళ్ళు
అన్నీ నీ చలవే కదా...
కనురెప్పపాటులో
విశ్వాన్ని సైతం
మాయం చేయగల
సాధ్యుడవు నువ్వే కదా...
మరి ఇంకెందుకయ్యా
నీకింత ఆరాటం?
కీలుబొమ్మలై జీవులు
కృషించిపోతుంటే
మోక్షమంటూ మరొక
మాయమాట చెప్పి
మళ్ళీ నిన్నే
వేడుకోమంటావు కదా..
ఎందుకయ్యా నీకింత శాడిజం?
అవును నీకు బాగా తెలుసు కదూ!
గొర్రె కసాయివాడినే నమ్ముతుందని...
| Read 10 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|