|
|
Articles: Poetry | భద్రత మనకెందుకు? - Dr. Raghotham Reddy Pinninti
| |
భద్రత మనకెందుకులే
బార్డర్ దాటివచ్చేవాడు
మనకు ఓటువేస్తే చాలు
అక్కడి నుండి ఇక్కడి వరకు
ఎర్ర తివాచీ పరిచే వాడినేమనాలి?
పేదవాడిని చూడడానికి మతం ఎందుకు
ఓట్ల కోసం మతం స్కేల్‌తో
మనుషులను కొలిచేవాడిని ఏమనాలి?
అరవై ఏళ్లుగా
ఎదుగుదలకు దిగువగా
ఓటుబాంక్ గా బ్రతుకుతున్న
అభాగ్యుల బాధ్యత ఎవ్వడిది?
బ్రతుకుల కంటే మతమే గొప్పదని
పరమత సహనం అంటే తెలియని
మనుషులు కాని మనుషులను ఏమనాలి?
టెర్రరిస్టు బాంబులు పేలుస్తాడు
ఆ ఇస్టూ...రైలు కాలుస్తాడు
నకిలీ సెక్యులరిస్ట్
బ్రతుకులను..భవిష్యత్తునూ...కాలుస్తాడు
అన్నీ తెలిసి
టీవీలో చోద్యం చూస్తూ
తిందాం పడుకుందాం
సిగ్గులేని..........వలె
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|