|
|
Articles: Devotion | తుంటరి బొమ్మ - Hi soumya
| |
తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ
మళ్ళి మళ్ళి రాదే ఈ మానవ జన్మ...
గొప్ప కులము నాదే అనుచూ
హెచ్చుతగ్గులున్నాయనుచూ
సాటివారినిలలో కించపరచబోకు
నీ వన్నెల చిన్నెల కన్నా
పరమేశుని కృపయే మిన్న
అది లేకుంటే బ్రతుకంత సున్న... 'తుళ్ళి'
ఎంత పెద్ద పదవులున్నా
చక్రవర్తి తానై ఉన్నా
చావుదప్పబోదన్నా పరమహంసకైనా
బంధువులెందరు ఉన్నా
నీ వెంటరారు ఒకరన్నా
మిగిలేది నీ ఖర్మ ఫలమేరా... 'తుళ్ళి'
(ఈ పాటను నా చిన్నతనంలో వినాయక చవితి పండగ జరుపుకునే అన్ని రోజులూ మా ఊరిలో భజన చేస్తూ పాడేవారు. అప్పుడు పాడుకున్న పాట... జీవిత సత్యాలున్నాయని ఇలా తెలియచేయడమైనది. ఈ పాట రాసినవారు నాకు తెలియదు.. క్షమించండి.. రాసినవారు ఎవరైనా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు)
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|