|
|
Articles: Poetry | హృదయ రవళి - Mr. Vamsi Krishna K
| |
గుండె బీడుపై కురిసిన వలపు తొలకరి
వయసు నీరెండలో మెరిసి వానవిల్లై...
నాలో నాటిన ఏడు రంగుల బాణం నువ్వు...!
కంటి కొలుకుల నిలిచే కలవు నువ్వు...!
నిదుర చిదిమే మధువు నువ్వు...!
సొగసు సేద్యాల మాగాణి నువ్వు...!
మది నదిలో గంతులేసే ప్రేమకెరటం నువ్వు...!
వేసవి రాతిరి వీచే చిరుతెమ్మెర నువ్వు...!
నీ ఇరుల కురుల విరుల మరులు...
నా వశమై పరవశాలు పంచిపోనీ...!
ఊపిరి గాలులు... మోసుకొచ్చిన... ఊహలు
మణికూజితాలై ముద్దుల మధుపత్రం రాసిపోనీ...!
చురుకంటే ఆ సూదంటు చూపులు చురకత్తులై...
నా ఎద కోసిపోనీ....!
ఆ పాలనిగ్గుల బుగ్గల మొగ్గలు విచ్చిన సిగ్గుపూలను...
నన్ను కోసుకోనీ....!
విరహపు వడగళ్ళ జడివానలో...
నీ బిగికౌగిలి నెగళ్ళలో నన్ను చలి కాచుకోనీ...!
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|