సూర్యోదయం కంటే ముందు ఆరంభమై
అశ్వం కంటే వేగంగా పరుగులు తీస్తూ
గార్దభం వలె ఇంటి - వంట పనులను
చాకచక్యంతో చకచకా పూర్తి చేస్తూ
కాకర పూవత్తి వలే చిటపటలాడే
నెమలి వంటి నా శ్రీమతి ముఖ ప్రసన్నత కోసం
శునకం వలే నిరంతరం కృషి సల్పుతున్న
నా జీవితం భావి భర్తలకు కనువిప్పు.
మర్కట బ్రహ్మచారి జీవితమే మెండు!