|
|
Articles: Poetry | మేలుకొలుపు - Site Administrator
| |
(డా.మోపిదేవి విజయగోపాల్)
ఒకపక్క ప్రాచీన హోదా
మరోపక్క ఏబీసీడీల రొద!
కుడిచేత్తో సాంప్రదాయ హారతి
పురచేత్తో పుట్టుక్కున తెగిన తెలుగుమతి!
అమ్మనీ పిల్లనీ వేరు చేసే కుట్ర
పిల్లవాడి ఏడుపు అమ్మకి అర్థంకాని రణగొణి
అమ్మ హృదయం అంతుచిక్కని పిల్లవాడి అభ్యుదయం
ఇద్దరిలో ఉన్న డి.ఎన్.ఎ. ఒకటైనా
ఒకరికొకరు ఆగంతకులు
ఇద్దరిలో ఉన్న ఆలోచనలొకటైనా
ఒకరికొకరు అద్దంలో ప్రతిబింబం!
ప్రపంచం అర్థం కావాలంటే
ఉగ్గుపాలతోనే విదేశీ విషం పొయ్యాలా
ప్రపంచంలో బతకాలంటే
కళ్ళు విప్పగానే కలర్ కళ్ళద్దాలు పెట్టాలా?
మరోసారి `వాడికి' బానిస కావాలా
నీదన్న పలుకును మరచిపోవాలా
మేలుకో మిత్రమా తెలుగుగళంతో
నీ సీమనేలుకో మిత్రమా తెలుగు కలంతో!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|