|
|
Articles: Poetry | పోరాటం - Mrs. sujatha Thimmana
| |
అనాదిగా మానవునికి
ఆరాటంలో...
బ్రతుకు పోరాటం
నాలుగు దిక్కులూ తవేననుకుని
ఏ దిక్కూనూ పొందలేక
శూన్యపు చూపుల పోరాటం
అహకారం ఆశల ఘీంకారం
జీవితపు విలువలు
తెలియని వానికదే
వ్యర్ధ పోరాటం
రహదారిలో నడవాలనుకుని
ఏ దారీ కానరాక
గోదారీ ఈదలేక
అలమటించే...
అల్పునికదే ఆరాటం
పసితనంలో ఆకలిదప్పులకై
ఆహారపు పోరాటం
పసిడి వయసులో
పరువపు ఉరకలకై
పడుచు గుండెల పోరాటం
వృద్దాప్యంలో తోడెవరూ లేరని
ఒంటరితనంతో పోరాటం
జీవితమంతా మనిషికి
తప్పనిదీ ఆరాటం...
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|