|
|
Articles: Poetry | వీడ్కోలు - Dr. Raghotham Reddy Pinninti
| |
నీవెళ్ళిపోవడమంటే
సంగీత జలపాతం కొద్ది కాలం ఆగిపోవడమే
నీవు రగిల్చిన
నృత్యపు కెరటం
ఎగసి పడుతూనే ఉంటుంది
భాష పరిచయం అవసరం లేని
నీ స్వర మాధుర్యం
సరిహద్దులు లేని ప్రపంచంలో
ప్రతిక్షణం సజీవంగా... ఉంటుంది
విమర్శల శరపరంపర
నీకు చేసిన గాయాలకు దూరంగా
సంగీత సాగరంలో కలిసిపోయి
నృత్యపు జలపాతంలోకి జారిపోయి
వెళుతున్నా ఓ నేస్తం
నా చెక్కిలి తడిపేస్తూ వెళుతున్న కన్నీటి చుక్క
ఇష్టం లేకున్నా
వీడ్కోలు చెబుతోంది
ఆధునిక సంగీత ప్రపంచంలోకి ఎవరు రావాలన్న
నిను కలువకుండా రాలేరు నేస్తం
(పాప్ సంగీత మహారాజు కోసం)
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|