నీకూ నాకూ మధ్య
అంతులేని అనురాగం
కానీ...
అనంతమైన దూరం
మనిద్దరికీ మధ్య
లేశమాత్రం లేదు దూరం
ఎందుకో...అంతులేని ద్వేషం
ఈ రాగద్వేషాలని
నెమరువేసుకునేలోగా
వెక్కిరించే సంధ్యాసమయం
అందుకే అటు చంద్రుడిలో
ఉదయించలేనప్పుడు
ఇటు సూర్యుడితోనే
అస్తమించటం మంచిదేమో
కా...దం...టా...వా...?