|
|
Articles: Short Stories | మంచు పూలు - Miss rajeswari rajeswarinedunuri
| |
ఆంటీ! ఈ రోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం. మీరంతా తప్పకుండా రావాలి' అంటూ పొద్దున్నే వచ్చిన నీలిమ పిలుపు. మొన్నటికి మొన్న 'ఆంటీ! ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా! మీరొచ్చి తప్పకుండా వాయనం తీసుకోవాలి. పెద్ద వారుకదా ముందుగా మీకే ఇవ్వాలని', ఈ ఏడు మా అదృష్టం. ఇక్కడ ముత్తైదువలే దొరకరు. ఒక్కరు ఇద్దరు ఉన్నా ఆఫీసులకి వెళ్ళి పోతారు. ఇక పెద్ద వాళ్ళంటె మీలా ఎవరైనా పేరెంట్స్ వచ్చి నప్పుడే దొరుకుతారు. నేను మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఒక అరగంటలో వచ్చేయండి... అంటూ ఎదురింటి రమ ఆహ్వానం .
అంతేనా? అంతకు ముందు మొన్న మంగళ వారం 'ఈ రోజు శ్రావణ మంగళ వారం కదా! పొద్దున్నే పూజ చేసుకుని ఆఫీసుకి వెళ్ళి పోయాను.ఇప్పుడే వచ్చాను. నాకు పదిమంది నా ఫ్రెండుకి పదిహేను మంది ముత్తైదువలు కావాలి. మీరంతా ఇంట్లో ఉంటామంటే శనగలు అవీ తీసుకుని తాంబూలం ఇవ్వడానికి వస్తాము' అంటూ ఒక స్నేహితురాలు ఫోను చేసింది. తప్పకుండా రండి. మేమెక్కడికీ వెళ్ళము. మాచుట్టు పక్కల కూడా పదిమంది దాకా దొరుకుతారు. మా ఇంట్లోనే మా అత్తయ్యగారు, మా అక్కా నేను ముగ్గురు ఉన్నాం' అంటూ చిన్న కోడలు ఫోను పెట్టేసింది.
ఇదంతా చూస్తుంటే శారదకి వింతగా అనిపించింది.ఏ...మి...టీ..? ఈ అమెరికాలో, ఇంత భారతీయత ఉట్టిపడుతోందా? ఇక్కడ కూడా ఫుజలూ, వ్రతాలు, నోములు మన సాంప్రదాయాలను విడనాడ కుండా? ?? నిజమే తను వచ్చి నప్పట్నుంచీ చూస్తోంది. చుట్టు ప్రక్కల ఏ పదిమంది ఇండియన్స్ ఉన్నా అందరు కలిసి కట్టుగా ఆడా మగా పిల్లా జెల్లా కలసి మెలసి పూజలు పార్టీలు, పిక్ నిక్‌లు చేసుకుంటూనే ఉన్నారు. వెనుక బ్యాక్ యార్డ్ లాన్ లో ఆటలు, డెక్ మీద పాటలు, శని ఆదివారాలు సాయంత్రాలు ఆనందంగా గడుపుతారు. ఇంట్లో ఎవరి భాష వాళ్ళు మాట్లాడు కుంటారు.తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం ఇలా. ఐతే ఇంతటి ఐకమత్యం మన దగ్గర లేదేమో అనిపిస్తుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|