|
|
Articles: Poetry | ప్రేమ వింత - Miss kumari kumari
| |
ఒకటిని రెండు చేసే
ఆ 'బాణం'
ఇరు హృదయాలను మాత్రం
ఏకం చేస్తుందెందుకు?
ఒకటి ఒకటి కలిపితే రెండు అని చెప్పే
ఆ 'గణితం'
ఒకటి ఒకటి కలిపితే ఒకటే అంటే
ఊరుకుంటుందెందుకు??
సర్వరోగ నివారిణి
ఆ 'సంజీవిని'
ప్రేమరోగిని చూసి
పెదవి విరుస్తుందెందుకు???
ఒకరిని మాత్రం గెలిపించే
ఆ 'ఆట'
ఒకరి మనసు ఒకరు గెలిచే
'సయ్యాట'గా మారుతుందెందుకు???
ప్రియుడు కలసిన రోజు మొదలు
'వేలంటైన్స్ డే' వరకు
ప్రతిరోజే కాదు..
నీ రూపానికి ప్రతిరూపాన్నిచ్చే
'అమ్మ'ను కావాలంటూ..
'ప్రియుని' నులివెచ్చని ఒడిలో
ఒదిగిపోవాలనుకునే 'ప్రేయసి'కి..
'మదర్స్ డే' కూడా
ప్రేమికుల రోజే
అనిపిస్తుందెందుకు???
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|