|
|
Articles: Poetry | స్వప్నాలు - Site Administrator
| |
(చిట్యాల రవీందర్)
కలలు అలలూ
ఎన్నో కలలు
కలలతో కలతలు
కలతలలో కలలు
కలలో ఎన్నో కళలు
కలవరపెడుతూ కలలు
కలవరం సృష్టిస్తూ...
కలలు ఒక్కోప్పుడు
వరం కూడా
నిజాలు కానందుకు
కలలు ఎన్నో
కొన్ని నిజాలైతే బావుణ్ణు
రంగు రంగుల కలలు
ఎన్నో హంగులతో కలలు
ఇంద్రధనుస్సులో కలలు
ఛిద్ర మనస్సుతో కలలు
స్వప్నాలు సాకారాలు
అయితే కొన్ని బావుంటాయి
స్వప్నాలు సంతోషాన్ని
నింపితే మరింత
సంతృప్తిగా వుంటాయి
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|