|
|
Articles: Poetry | నా ఊరు - Dr. Raghotham Reddy Pinninti
| |
ప్రకృతమ్మ ఒడిలో పురుడుపోసుకున్న పల్లె
పచ్చదనపు పరువాలతో ఊగిపోయినపల్లె
కిలకిలా రాగాలలో తడిచిపోయిన పల్లె
ఎడారిగా మారి కనుమరుగవుతోంది
బతుకుదెరువు పోరులో
పల్లె దాటిన బతుకు
పట్టణవాసంలో బందీ అయిపోయింది
వానచినుకుకు తడిచి మనసు దోచే
మట్టి వాసనను మరచిపోయింది
కులమతాలేవయినా
వరసలు పెట్టుకు
పిలుచుకున్న పల్లె
మమతానురాగాలు పంచుకున్న పల్లె
కష్టసుఖాలేవయినా కలచి నడచిన పల్లె
ఏ పిలుపూ వినబడక చెవిటిదైపోతోంది
ఏ కష్టంలో ఉన్నా రమ్మని పిలిచిన పల్లె
అమ్మలా అందరినీ పెంచుకున్న పల్లె
ఆనందాలన్నింటినీ పంచిపెట్టిన పల్లె
ఎప్పుడొస్తారో నా పిల్లలని ఎదురుచూస్తోంది...
(నాకు బతుకునిచ్చి బతకడం నేర్పిన నా ఊరు గర్నెపల్లి, జాఫర్‌గఢ్, వరంగల్ - ఆంధ్రప్రదేశ్ కోసం...)
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|