|
|
Articles: Poetry | గోదావరి ఒడ్డున - Site Administrator
| |
(చిట్యాల రవీందర్)
బ్రతుకంటే అదో నిరాశగా
మిగిలి, నైరాశ్యం నా మది నిండా
పరచుకొని నన్ను నా జీవితాన్ని
వెక్కిరిస్తున్నప్పుడు-
నేను గోదావరి ఒడ్డున ఉన్నప్పుడు
నన్ను ఆ నదిపై వీచే గాలి
అక్కున చేర్చుకున్న అమ్మలా
ఆశావాదం నా మదిలో నింపింది-
నాలో కొత్త ఉత్సాహాన్ని సృజియించింది
వేదనతో నేనున్నప్పుడు
ఆవేదనతో మనసు కలతచెందినప్పుడు
ఆనంద ద్వారాలు తెరిచేది
ఆ గోదావరి ఒడ్డే-
ఉరకలేసే ఉత్సాహం
ఇంకినప్పుడు
నన్ను నేను స్థిమితపరుచుకునేందుకు
నేను గోదావరి ఒడ్డుకెళతాను-
అమ్మ ఒడిలోలా సేదదీరుతాను
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|