|
|
Articles: TP Features | కరవును ప్రేమిద్దాం! - Site Administrator
| |
(త్రైలోక్య)
'కరవును' ప్రేమించుమన్నా... నిధుల వ్యయాన్ని పెంచుమన్నా... అన్నట్లుగా కరవు విస్తరిస్తోంది. కరవు అంటే ఉపాధి పనులు కల్పించడం ప్రభుత్వాలకు సంక్షేమ బాధ్యతగా మారింది. దేశంలో కరవు వొచ్చినప్పుడు ఇంత స్థాయిలో ఉపాధి పనులను కల్పిస్తున్న దేశం మరొకటి లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGA) కింద గ్రామంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి యేడాదికి 100 రోజుల పాటు ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా నాలుగు కోట్ల కుటుంబాలకు ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక్క కుటుంబానికి ఐదుగురు సభ్యులు వంతున 20 కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నట్లు లెక్క.ఇందుకోసం వ్యయం చేసే మొత్తం ఎంత మొత్తానికి సమానమో తెలుసా! 2008-09లో భారత ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తంలో 13.6 శాతం.
ఆయా ఉపాధి పనులో అవినీతి ఉండవచ్చు. కనిపించని కార్మికుల పేర్లు, కార్మికుల జాబితాలో ఉంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల 48 రోజులకు మించి ఉపాధి కల్పించడం లేదన్న విమర్శ ఉంది. అయినా కూడా కరవు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఇంకా అధికంగా నిధులను వ్యయం చేయనున్నారు. సెప్టెంబర్ రాకతో పరిస్థితి తీవ్రత పెరుగుతుంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతంకన్నా 29 శాతం తక్కువగా వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కలవర పడ్డాయి. కరవు ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|