|
|
Articles: Poetry | చంద్ర యానం - Mr. Jagannadha Rao LakshmiPrasad
| |
అంతరిక్ష యానంలో
అంతరించిన చంద్రయాన్
మౌనరోదన
కంప్యూటరు వైర్ల గుండా పాకుతూ
చంద్రయాన్ ఆత్మని సేద్యం చేయడానికి
Toggle buttons
దేనినో వెతుక్కుంటూ
మంచుగడ్డ చందమామ
మీద కుందేలు
మా రోదసీ యానం
ఏదో వెలితి
మన చంద్రుడు కనబడక
చంద్రునిపై కాలు మోపేక
మేం పోగొట్టుకున్న దృశ్యం
భూమ్యోదయం
శూన్యంలోకి చంద్రయాన్ ప్రయాణం
మానసిక బరామీటర్
అట్టడుగు స్థాయిని సూచిస్తూ
నిర్జీవమైన చంద్రయాన్ - 1 లో
ఒక రోబో విచారవదనంతో
తన యజమానిని వెతుక్కుంటూ
రెక్కలల్లారుస్తూ
రాలిన పక్షి చంద్రయాన్
Animated రెపరెపలతో
తిరగబడిన భూమ్యాకర్షణ,
పైకి పడిపోతూ
పాలపుంత కేంద్రంలోకి
మా రోదసీ యానంలో
నూతన సంవత్సరాలు లేవు
అన్నీ కాంతి సంవత్సరాలే
నిజమైన యోగి
రేపటి చంద్రోదయం
అతని నేత్రాలలో దాగి
చంద్రయాన్ తనువు కృష్ణబిలం అంచున
మనసు డోలాయమానం పంచన.
(చంద్రయాన్ - 1 జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని తెలిసి...)
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|