|
|
Articles: Poetry | నీ చెలిమి - Mrs. sujatha Thimmana
| |
నీ చెలిమి వయసు
చిరు ప్రాయమయినా
మన ఆత్మల కలయిక
ఏ ఎనక జన్మలదో...
నీ సన్నిహితంలో
నా తనువు...
చలన రహితమవుతుంది
నా ప్రాణం
నీ శ్వాసలో చేరి
నీ జీవమై...
నాక్కనిపిస్తూ ఉంటుంది
నీ దూరంలో...
నా మనసు
మౌనాన్ని ఆశ్రయిస్తే
తప్పనిసరి క్రియలను చేస్తూ
ఈ శరీరం...
నీ తలపుల
కొలనులో సేద తీరుతూ
ఆనందాన్ని ఆస్వాదిస్తుంది
ఏది ఏమైనా...
మన మధ్యన పెనవేసుకున్న
ఈ బంధం...
ఎన్నటికీ వాడని,
సుగంధాలు వీడని
వసంతంలో విరిసిన
తెల్లని మల్లియ...
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|