|
|
Articles: Poetry | నానీలు - 49 - Miss kumari kumari
| |
భూమాత
సహనానికి కాబోలు
పారిజాతాలు చేస్తున్నాయి..
పుష్పాభిషేకం..
ఛిద్రమైన
పాపల పిండాలకు
నిరసనగా నేలరాలింది..
పారిజాతం!
రాలే పారిజాతం
నాడు 'రుక్మిణి'కి వరం..
నేడు మాత్రం
కన్నవారికి శాపం..
'కందుకూరి' సేవకు..
సమాధి చెంతనే
ఓ పారిజాతం చేస్తుంది..
పుష్పాంజలి..
కలహప్రియుని
కుతూహలంలో
ఇద్దరి నడుమ..
పాపం 'పారిజాతం' బలి..
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|