|
|
Articles: Poetry | కలా..ఓ కలా.. - Miss kumari kumari
| |
కలా.. ఓ కలా
దుఃఖించే మనసును సేదదీర్చి
కష్టాల కడలికి ఆవలనే ఉండి
లేని సంతోషాన్ని అరచేతిలో స్వర్గంలా
అనిపించి - కనిపించి - మురిపించి
మనసుకు హాయినిచ్చి
మరు నిమిషంలో సవ్వడి చేయక
మాయమగుట తగునా..
ప్రశాంత జీవనంలో
మధురిమలు కురియువేళ
ఆశలు అడియాసలైనట్లుగా
కోర్కెల కోరలలో చిక్కిన
భయంకరానుభూతిని
ఒక్క తృటిలో కలుగజేసే
ఓ కలా..
నీవు త్వరగా మాయమవవేమి..
మధురిమలిచ్చేదీ నీవే..
అడియాసలొలికేదీ నీవే..
నీవు కల్పించే ఈ అనుభూతులకు
అదరక - బెదరక - పొంగక
నాకంటూ ఓ పథాన్ని పరచుకుంటా..
ఆ పథంలో
ఎదురులేని - తిరిగి చూడని
మనస్సుతో జీవన పోరాటం సాగిస్తా..
నీ అనుభూతులను పదిలంగా దాచుకొని
నా పథానికి బాసటగా చేసుకొని
మరింత ముందుకు సాగిపోతా..
అందుకే ఓ కలా..
ఎప్పటిలా నీవు రా..
నా గమ్యానికి చుక్కానివి కా..
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|