|
|
Articles: Poetry | స్నేహమా... - Mrs. sujatha Thimmana
| |
దరిచేరని స్నేహమా...
దాగుడుమూతల ఆటలో
చేజారినదీ...
చెలిమి అనుకున్న పుష్యరాగం
వేదనతో ఎంత వెతికినా
అగుపించదే...
దైన్యమైనదీ నా బ్రతుకు
ఎడారి వంటి మనసునా
నీ పలుకే...
పన్నీటి జల్లనుకున్నా
మౌనవించిన స్నేహమా...
మరల... మరల...
తపనలకంకితమై
తావిలేని పేరుగా
మిగిలిపోతా...
ఆ దైవం కరుణిస్తే...
నీలో నేనై పుడతా
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|