|
|
Articles: Poetry | ఎయిడ్స్ కంటే డేంజర్ - Dr. Raghotham Reddy Pinninti
| |
నన్ను చూసుకున్నపుడు కొన్నిసార్లు
మిమ్మల్ని చూస్తున్నపుడు చాలాసార్లు
సిగ్గుగాను... చింతగానూ ఉంటుంది
తప్పన్నది ఎప్పుడూ చెయ్యనట్టు
తప్పన్నది ఏమిటో తెలియనట్టు
మాటల రంగులు మార్చడం
నిజం చెప్పటానికి
తప్పు ఒప్పుకోవడానికి
ధైర్యంలేని దద్ధమ్మలా...
బ్రతుకును లాగటం... బరువుగా బ్రతకటం
వ్యక్తిత్వపు ఎముక లేకుండా.. గోడ మీద నిలపడటం
దూకడానికి సిద్ధంగా
మనమే ఇలా ఉంటే
మంచి బుద్ధులు ఎలా నేర్పగలం
వలువలుంటే చాలా... విలువలు వద్దా?
మహా అయితే కోట్లు
లేకపోతే పదవులు అంతే కదా!
వ్యక్తిత్వం లేకపోవడం... ఎయిడ్స్ కన్నా ప్రమాదం
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|