|
|
Articles: Poetry | స్నేహితుడా ఓ... - Dr. Raghotham Reddy Pinninti
| |
విజయాన్ని గుండెతో.. హత్తుకునే వాడు
ఓటమి మార్గాన్ని.. మార్చగల వాడు
కన్నీటి భాషను చదవగలిగే వాడు
స్నేహితుడొక్కడు... లేకపోతే
బ్రతికి ఉండటంలో అర్థం ఏమిటి?
ఆనందాన్ని గుప్పెట్లో దాచి
బాదరబందీలను.. దూరంచేసి
బ్రతుకులోని.. ఆనందాన్ని
ఎప్పుడు అడిగినా... వరంగా ఇచ్చే
ఆత్మీయుడొక్కడూ.. లేకపోతే
మనతో ఎమున్నట్లు?
హద్దులు అనేవే లేని.. ప్రపంచంలో
అమ్మలా.. నడిపించి
నాన్నలా.. కలిసిపోయె
ఒక అద్భుతమ్.. లేకపోతే?
ఎటువెళుతున్నట్లు?
అమ్మ వంటిది ఈ లోకంలో..
ఒకే ఒక్కటి.. మిగిలి ఉంది
అవసరం.. స్వార్ధం.. మోసం..
స్నేహంలో కలపకండి
స్నేహమనేది
భాష లేని మమకారం
భరోసా నిండిన ప్రయాణం
నిండుగా ఉన్న అమృత భా౦డ౦
శూన్యం తరుముతూ ఉన్నా
కన్నీటి కట్టలు తెగిపొయినా
ఆనందపు అలలలో కొట్టుకుపోయినా
స్నేహపు కవచం.. నీ చుట్టూ ఉంటే
విజేతవు ఎప్పుడూ నీవే
(జ్యోతి & హాసలకు అంకితం)
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|