|
|
Articles: Devotion | సాయి శరణాగతి - Site Administrator
| |
(కె.అరుణ)
(నిద్రించుటకు ముందు స్మరించదగిన ప్రార్థన)
జగన్నాధా! సమర్ధ సద్గురు సాయినాథా! ఈ రోజు తమరు నాపై చూపిన కరుణాకటాక్షములకు కృతజ్ఞత చూపుతూ పరిపరివిధముల సాష్టాంగ నమస్కారములు చేయుచున్నాను. తమ శుభదాయకమైన జాగ్రత్తచే నేను ఈ దినమును ఆనందముతో గడిపితిని. విశ్రాంతి చేయు సమయు తిరిగి సమీపించినది. శయనించుటకు ముందుగా మీ దైవిక హృదయమును శరణాగతి వేడెదను. ఓ దయార్ద్ర హృదయుడవగు తండ్రీ సాయినాధా, నీవే నన్ను రక్షించగలవాడవు, నీ వొక్కడవే నాకు ఆనందమును, శాంతమును, సుఖమును కలుగజేయుగలవాడవు. నేను దిక్కులేని వాడను. నాకు వేరే దిక్కు లేదు. నీవు తప్ప నన్ను రక్షించువారెవ్వరూ లేరు. గాన నీ కరుణాకటాక్షములపైనే నేను పూర్తిగా ఆధారపడి ఉన్నాను.
సర్వజ్ఞుడవగు ఓ సాయి! మీ ఆజ్ఞానుసారము నేనీ దినమందు ఒనర్చిన పాపములను, కృత్యములను మీ కనికరపు హృదయమునకు తెలిసియే ఉన్నవి. గాన మీ అమృతతుల్యమగు కరుణారసమునకై, మీ అనుగ్రహమునకై ప్రార్థించుచున్నాను. నా అంతరాత్మను పావనముచేసి తిరిగి ఎటువంటి పాపములందు నా మనస్సును పోనివ్వక, బలమైన మనోనిశ్చయమును కలిగింపుము. నీ సహాయము, ఆశ్రయము లేనిదే హీనమగు కోరికను, ప్రేరేపణను జయించలేను. మరియూ నా హృదయమునకు వేదన కలుగజేయు మోహమును గెలువలేను. గాన మిమ్ముల్ని అణుకువతో వేడుకొనుచుంటిని. ఓ కరుణానిధియగు సాయి! నా మనస్సుకు ధృడనమ్మకము, విశ్వాసమును కలుగజేయుము. ప్రతి నిత్యము మీ ఆజ్ఞానానుసారం ప్రవర్తించునట్లు నన్నాశీర్వదించి భద్రపరచుము.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|