|
|
Articles: Poetry | తెలుగు తల్లి ఆవేదన - Mr. Srinivasulu Reddy Palavalli
| |
నీ తల్లి భాషను తెలుగును
నీ జాతికంతటికి వెలుగును
దారి చూపేటి దివ్వెను
నీ కడుపు నింపేటి బువ్వను
వినరా నా గోడు తెలుగోడా!
నన్ను బ్రతికించు ఓ యువకుడా!
తియ్యని మాట నా కడుపున పుట్టింది
తెలుగు వారందరికీ వారసురాలయింది
ఎంగిలి మాటలు వచ్చి పెత్తనం చేస్తుంటే
ఊరుకున్నా నువ్వు తోడని
వినరా నా గోడు తెలుగోడా!
నన్ను బ్రతికించు ఓ యువకుడా!
నీ తల్లి భాషను తెలుగును
నీ జాతికంతటికి వెలుగును
నీ తోటలోని పువ్వును
పసిపాప మురిపాల నవ్వును
అమ్మ బాబు వేలు వదిలిన బాల్యము
మమ్మీ డాడిల వెంట పరిగెత్తుతున్నది
రోజురోజుకి నేను కనుమరుగైపోతున్నా
ఊరుకున్నా నువ్వు తోడని
వినరా నా గోడు తెలుగోడా!
నన్ను బ్రతికించు ఓ యువకుడా!
నీ తల్లి భాషను తెలుగును
నీ జాతికంతటికి వెలుగును
అందాల పడతి మువ్వను
భాషా గగనాన తారాజువ్వను
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|