TeluguPeople
  are the trend-setters

 
Articles: Poetry
తప్పిపోయిన ఆకాశం
- Mr. ramu vidyarthi veluri
  Page: 1 of 1    
అది పట్టపగలు నెల ఏదో రుతువేదో తెలిసిరాని పసిప్రాయం నిండిన చెరువులు అద్దాలై మెరుస్తూ పచ్చని చేలు దుప్పట్లు పరిచినట్లు దూరంగా గుట్ట ఒకటి కట్లపూల రాశి వలే చేను గట్టున ఒక తుమ్మపొద ఒళ్ళు విదిల్చిన ముండ్లపందిలా చిమ్మట్లు దాని కొమ్మలకు పాటల అంట్లుగడుతూ చేలో మట్టిబారిన వెండిమువ్వల వేరుసెనక్కాయల్ని తెంపి రాశులు పోస్తూ అమ్మ, అమ్మమ్మ, నానమ్మ మరికొందరు ఆడవాళ్ళూ పక్కచేలో దంతెకొడుతూ నాన్న, చిన్నాన్న మరికొందరు మగవాళ్ళూ సాళ్ళ మధ్య సాగే దంతె జాజుకుంకుమను నేరుపుతున్నట్లు పగటిదూపకు వేళయింది సద్దిమూటలు విచ్చుకున్నై రాతెండిగిన్నెలోని, దూప మెల్లగా గొంతులోకి దిగుతూ చంచలపు నాచూపులు గిన్నెలోకి దూరి అప్పుడు హఠాత్తుగా గిన్నెలో తెల్లతెల్లగా పగిలిన నల్లనల్లని ఆకాశం అంతులేని ఆనందం గంతులేసిన ఆనందం అది ఎట్లా చెప్పాలో తెలియని అద్భుత దృశ్యం ఎవరికి చెప్పాలో తెలియనితనం ఇక ఆ రోజు నుండి ఏ రోజుదాక మళ్ళీ ఆ ఆకాశం కోసం వెదుకని రోజు లేదు తట్టని తావు లేదు అరవయ్యేళ్ళు ఎదురుచూసి ఆరు ఖండాల మీద వెదికి నిరాశతో ప్రకటిస్తున్నాను తప్పిపోయింది నా ఆకాశమని (1949-2009 వరకు నన్ను వెంటాడుతూ వచ్చిన ఒక అనుభవం, ఒక అనుభూతి ఏ రోజుకి అక్షరాలకు లొంగింది) దూప=మజ్జిగతో కలిపిన జొన్న జావ. రాతెండి=అల్యూమినియం

Read 5 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 1    



 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
Andhra Pradesh
Anantapur
Eluru
Guntur
Kadapa
Kakinada
Kurnool
 
Nellore
Ongole
Rajahmundry
Tirupati
Visakhapatnam
Vijayawada
Telangana
Hyderabad
Karimnagar
Warangal
Nizamabad
Photos
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

(C) 2000-2018 TeluguPeople.com, All Rights Reserved.