|
|
Articles: My Thoughts | తుగ్లక్ పరిపాలన - Mr. pyyetisrinivasarao srinivasulu
| |
అప్పుడెప్పుడో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను విభజించుకున్నాం. ఇప్పుడు ప్రాంతీయ తత్త్వంతో విడిపోవాలనుకుంటున్నాం. అందువల్ల ఒకే భాష మాట్లాడే వారు వేరుకుంపట్లెట్టుకుని బతకాలనుకుంటున్నాం. అవును ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలెక్కడుంటున్నాయి? ఒకే కుటుంబంలోని వారు విడిపోయి తల్లిదండ్రులని కూడా విడిగా పెట్టి బ్రతికే రోజుల్లో వసుథైక కుటుంబంగా బతకాలంటే ఎలా కుదురుతుంది. తెల్లారి లేస్తే ఈ కొట్లాటలతోనూ, ప్రతి చిన్న విషయానికీ హెచ్చు తగ్గులను బేరీజు వేసుకుంటూ బ్రతకడం కష్టం. అందుకే ఒక తుగ్లక్ ఆలోచన చెబుతాను, దయ ఉంచి ఫాలో అవండి. ఇప్పుడున్న ప్రతి రాష్ట్రంలోనున్న ప్రతి గ్రామాన్నీ ఒక మినీ ఇండియా చేసి పారేద్దాం. అదెలాగంటారా? ప్రతిగ్రామాన్నీ ఒక కాస్మాపాలిటన్ గ్రామంగా మారుద్దాం. ప్రతి గ్రామంలోనూ అన్ని రాష్ట్రాల ప్రజలనూ తీసుకొచ్చి, ఒక్కో ఇంటిలో ఒక్కో రాష్ట్ర మనుష్యులను పడేసి బ్రతకమందాం. అంటే..ఒక ఆంధ్రా కుటుంబం - దానిపక్క ఒక మరాఠీ కుటుంబం - దాని పక్క ఒక ఒరియా కుటుంబం - దానిపక్క ఒక బెంగాలీ కుటుంబం - దాని పక్క ఒక గుజరాతీ కుటుంబం - దాని పక్క ఒక మళయాళీ కుటుంబం - దాని పక్క ఒక కాశ్మీరీ కుటుంబం - దాని పక్క ఒక అరవ కుటుంబం ఇలా అన్ని రాష్ట్ర ప్రజలనీ ప్రతి గ్రామంలో సద్దేద్దాం. ఇలా చేసినందు వల్ల ప్రాంతీయ తత్వాన్నీ, భాషా ప్రేమికులనీ విడగొట్టినట్టౌతుంది.,అప్పుడు ఎక్కడా ఏ గొడవా ఉండదు. ఏ అలజడీ ఉండదు. ఇలా సంసారాలని సర్దడం ఉపాధులు కల్పించడం మొత్తం యుద్ధ ప్రాతిపదికను చేబట్టి, మనమందరం విడిపోయి కలిసి ఉన్నట్టు అవుదాం. ఎన్ని ముక్కలు ఎన్ని చెక్కలయితే అంత సుఖం. ఎవరితిండి వారే తినచ్చు. ఎవర్ని వారే పరిపాలించుకోవచ్చు. ఒకరికీ ఒకరికీ సంబంధం ఉండకూడదు. సంబంధం ఉంటే మళ్లీ ఏవో గొడవలొస్తాయి. ఇలా జనాలని విడ గొట్టి పరిపాలించడం కేంద్రానికి కూడా సులువు. జై తుగ్లక్ పరిపాలన! జై-జై తుగ్లక్ పరిపాలనా అంటూ ఎదరకు కదలండి. ఛస్తే మనకు కలిసి ఉండటం చేతకాదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|