|
|
Articles: Poetry | కలల తాగుబోతు - Mr. ramu vidyarthi veluri
| |
ఏమంటున్నావు సోదరా
కవి 'విద్యార్థి'తో మాట్లాడాలా?
అది సాధ్యంకాదు మిత్రమా
అసలే ఇది హేమంత రుతువు
అందునా ఇప్పుడుషోదయం
విపరీతంగా సిందూరం కురుస్తోంది
పచ్చగరిక మైదానమ్మీద
నీహారికాసమూహాలు వాలి
ఇంద్రచాపపు విరులై విచ్చుకొంటున్నాయి
వాడు పూవు నుండి పూవులోకి
ఓ భ్రమరమై దూరి
మనసు పీకల దాకా
పూల ఎదల్లోని మదిరను తాగి
నిషాలో మునిగి తేలుతున్నాడు
వాడిప్పుడు ఓ కలల తాగుబోతు
ఇక నీకెక్కడ దొరుకుతాడు?
మరెప్పుడైనా ప్రయత్నించు
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|