|
|
Articles: Poetry | పుష్ప కాంక్ష - Site Administrator
| |
(డి. లక్ష్మీనరసింహాచార్యులు)
నేను కోరగబోను నిక్కమ్ముగాను
రాజేంద్రు శిరముపై రాజిల్లగాను!
నేను కోరగబోను నిక్కమ్ముగాను
పడుచు జంటలు పండు ప్రక్కపై నుండ!
నేను కోరగబోను నిక్కమ్ముగాను
రారాజు శవముపై రంజిల్లగాను!
ఓ! తోటమాలిరొ! ఒక మాట వినుము!
మాతృ దాస్య విముక్తి మదిలోన నెంచి,
స్వాతంత్ర్య సమరాన సర్వమ్ము విడచి
ఉరిత్రాడు ముద్దాడి ఉసురుల వీడి,
మాన్య వీరులు పోవు మార్గమధ్యమున
నలిగిపోవగ కోర్కె మదిలోన కలదు!
పుడమితల్లికి జేజేలు.
| Read 6 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|