|
|
Articles: Poetry | కృషి vs అదృష్టం - Miss Jyothireddy Sooram
| |
రేపన్నది విలువైందిగా నువ్వు మార్చుకో
నీ రాతనే నీ ఆశయంతో ముడివేసుకో
చేతులోనే ఉన్నది కరుగుతున్న కాలమూ
చేతనైతే మార్చుకో, చెరిగిపోని రీతిలో...
నీది కాదు కథ ఎప్పుడు ఏమి జరుగునో తెలుసుకో
నిన్న అంటే రాదుగా రేపు ఇంకా సరిచేసుకో
ఉన్నదింక ప్రస్తుతం దాన్ని వదలకు ఎన్నడూ
చిలికినప్పుడే వెన్నగా,
కష్టాలతోనే తెలియునే
ఈ జీవితమొక అర్థం...
రాయి కూడా శాశ్వతం
మనిషి మనస్సుకు లేదుగా
ఆశయాలే మూటగా
పిడికిలై బిగించగా
చెమటనీరే చిందగా
నీ శ్వాసకింక రాదు కద నిద్దుర
శ్వాసలోన ఇమిడినా
నీ ఆశయానికి కురవదా పూలవర్షం...
కష్టపడితే దొరకదా ఊహకందని ఫలితమూ
కృషిని మించగలదా ఏనాటికైనా అదృష్టం
చేసి చూపు దీటుగా ఎప్పుడు ఏమైనా
చేతిలో గీతలే మారేనే
నీ నుదుటి రాతలు మారవా...
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|