|
|
Articles: Poetry | తొలిరేయి ముచ్చట - divya tummala
| |
ఏ తోటలో విరబూయని నిలువెత్తు కుసుమం తానని
తన మధువులె గమ్యముగ పయనించు భ్రమరం నేనని
కన్నె సొగసుల సొత్తులన్ని కొంగులో కట్టొద్దని
అందాల విందును కొసరి కొసరి నాకు వడ్డించాలని
దూరాలు చీల్చుకు రమ్మని
మానస చెలియనొకపరి వేడని
మోహమను మధిరను గ్రోలిన
మత్తుకళ్ళతో చూడని అందాలని
వేడిగ నిట్టూర్చగ చేదించని మౌనాలని
బిడియాల తెరలు తొలగగ
బిగికౌగిట బంధించని చెలియని
నా స్పర్శతో పులకించగ
చుంబించని అధరాలని
అలుపుతో శయనించిన
చెలి స్వేదమును చిందించని
తియ్యని అనుభూతిగ
తొలిరేయి ముచ్చట మిగలని అని
సుగుణాల సుదతిని పరిణయంతో పొందిన తన వరుడిని
మానస మౌనముగ నను వేడని నా భార్యని
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|