TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
సంఘానికే వైద్యం కావాలి
- Site Administrator
  Page: 1 of 5   Next > >  
(డా. కత్తి పద్మారావు) పాశ్చాత్య దేశాల్లో అభివృద్ధి చెందుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మనవాళ్ళు అభ్యసిస్తున్నారు. అందులో వైయక్తిక చేతన - సమాజం నుండి విడివడి అభివృద్ధి చెందడం ఎలాగో నేర్పుతారు. కాని భారత ఉపఖండంలో మనోశాస్త్రాన్ని భారతీయులు అధ్యయనం చేయలేకపోయారు. కరుణశీలి 'స్త్రీ' : అన్ని జీవుల కంటే మనిషి విలువైన వాడు. అతనిలోని మానవత్వం అన్నిటికంటే ఉత్తమమైనదిగా బౌద్ధం భావించింది. మానవత్వంలో రంగరించబడిన ప్రధానాంశం కరుణ, ఆర్ద్రత, సున్నితత్వం. ఈ గుణాలు లోపించినవాడు మానవుడు కాజాలడు. అలాగే స్త్రీలలో సంతానోత్పత్తి కారణంగా ఇది ప్రధానగుణం అవుతుంది. 'కరుణ' సహజసిద్ధమైనా మానవులకు దాని ప్రేరణ శక్తులున్నప్పుడే అది అభివ్యక్తం అవుతుంది. ఒక మనిషిలో నుండి మరొక మనిషికి దేనికి కరుణ? ఎందుకు కరుణించాలి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కరుణ విశ్వజనీనం. దేశాల హద్దులను చెరిపివేస్తుంది. బుద్ధుడు రాజ్యాన్ని, కుటుంబాన్ని వదిలాడు. తత్వ జిజ్ఞాసతో అనేకాంశాలను అన్వేషించాడు. తల్లిలో పొందలేనిది, భార్యలో పొందలేనిది తత్వశాస్త్రంలో ఏముంది! తల్లి ప్రేమకు, భార్య ప్రేమకు పరిధులు ఉన్నాయి. వాటిని దాటగలిగితే విశ్వజనీనమైన ప్రేమ ఆవిష్కృతమవుతుంది. ప్రపంచమంతా పరిమితుల్లో ఉంది. అందుకే అది పెద్దగా ఉన్నా సంకుచితంగానే ఉంది. సంకుచిత తత్వంలో కరుణ, ప్రేమ ఆవిర్భావానికి అవకాశం లేదు. బుద్ధుడు కరుణభావ ప్రేరిత అయిన స్త్రీ గురించి ఇలా చెప్పాడు : 'మానవ సమాజంలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది. తన గర్భంలో ఒక క్రొత్త జీవి ప్రవేశించినప్పటి నుండీ తన ఆహారాన్ని బిడ్డకందించి పోషిస్తుంది. ఆ బిడ్డ భూమిపై పడ్డాక ఆ తల్లే తన తొలి ఉపాధ్యాయురాలు' (బోధిసత్వ అంబేడ్కర్ - బౌద్ధ ధర్మ ఉద్యమం పేజి : 483) స్త్రీ తన సంతానాన్ని రక్షించుకోవడానికి కరుణశీలి అయ్యింది. ధర్మవీర గుణంతో ఈ రక్షణలో భాగంగా ఆయుధాన్ని కూడా ధరించిన తల్లిగా రూపాంతరం చెందడం ఒక పెద్ద పరిణామం. అందుకే 'తల్లి'లో కరుణ, ప్రేమ, జ్వలన, ఉత్ర్పేరణ, ఉద్వేగం అన్నీ జనిస్తాయి. అనేక సందర్భాల్లో తన బిడ్డ కోసం ఆమె వెయ్యి అడుగులు ముందుకేస్తుంది. పదడుగులు వెనకకు వేస్తుంది. అందుకే బౌద్ధం జననం తల్లి భావనలో ఉంది. ఇదే తల్లి ఇతరులకు ప్రేమను అందించగలిగితే జ్ఞానజిజ్ఞాసువు అవుతుంది. తన చేతిలోని కరవాలాన్ని పక్కన పడవేస్తుంది. తల్లిని, భార్యగా రూపొందించడం వేరు. సహచరిణి కావడం వేరు. సహచరిణిగా ఎదగనివ్వడానికి పురుషుడు అడ్డుకున్న సమాజం నుండి ఆమె తట్టుకొని ఈనాడు స్వతంత్రంగా ఎదగగలుగుతుంది.

Be first to comment on this Article!

  Page: 1 of 5   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2019 TeluguPeople.com, All Rights Reserved.