|
|
Articles: Poetry | తెలుగు సినిమా తల్లి - Site Administrator
| |
(క్రియేటివ్ శివ)
కాస్త నవ్వించేది
కొద్దిగా ఏడిపించేది
మరింతగా ఆలోచింపచేసేది
మన తెలుగు సినిమా తల్లి
వెండితెర వెలుగుతున్న రోజుల్లో
ఎన్టీఆర్ పలికిన డైలాగుల్లో
ఏయెన్నార్ వేసిన స్టెప్పుల్లో
ఎందరో కళాకారుల చేతుల్లో
వెలిగిపోయింది తెలుగు సినిమా తల్లి
కాలం ముందుకు సాగెను
జనం ఆలోచన మారెను
అదే దారిలో సినిమా సాగెను
అప్పుడూ.. ఎప్పుడూ..
తనను చూడ వచ్చే వాళ్ళను..
నవ్వించే, ఏడిపించే, ఆలోచింపచేసేదే
తెలుగు సినిమా తల్లి
కాలం మరింత మారేను
సినిమా తల్లి కష్టాలు చూస్తే
బుల్లితెర గుదిబండలా మారితే
పైరసీ పెత్తనం చెలాయిస్తే
క్రుంగీ కుదేలై
విలపించే తెలుగు సినిమా తల్లి
సినిమాను సినిమాగా చూడండి
ఏ ఒక్క ప్రాంతానికి అది సొంతం కాదులెండి
కళను గౌరవించండి
కళాకారునికి కల్మషం ఉండదండి
ఎన్నో కష్టాలుపడి మన కోసం
ముస్తాబు అవుతున్న సినిమాలు చూడండి
తెలుగు సినిమా తల్లి చిరునవ్వు ఇక చెరగకూడదండి
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|