TeluguPeople
  are the trend-setters

 
Articles: My Thoughts
విదేశీ వితండ వాదం
- Site Administrator
  Page: 1 of 3   Next > >  
(డా. దుగ్గరాజు శ్రీనివాసరావు)

భూతాపం పెరిగింది. ఇది సుస్పష్టం. మనకు 1800 నుండి ఉష్ణోగ్రత చరిత్ర అందుబాటులో ఉంది. 200 పై చిలుకు సమాచారం ఆధారంగా జరిపిన అంచనా ప్రకారం ఉష్ణోగ్రత 0.74 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగింది. ఈ వేడి పెరగడానికి కారణం పారిశ్రామికీకరణ ఒక మూల అంశం. మరో వైపు పెట్రోల్, డీజిల్, కిరోసిన్, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వాడకం మితిమీరింది. వీటివల్ల భూ ఉపరితలంలో 'గ్రీన్ హౌస్' వాయువులైన కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ పెరుగుతుంది. ఈ వాయువుల విడుదల ఇలాగే కొనసాగితే 2100 నాటికి భూ ఉపరితల ఉష్ణోగ్రత 1.8 నుండి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పెరగవచ్చు.

ఈ పరిస్థితి వచ్చే సరికి నేడు భూతాపం గురించి ఆందోళన చేస్తున్న వారు కాని, దీని మీద చర్చిస్తున్న నాయకులు కాని మిగలరు. నిజానికి ఇప్పుడు భూమి మీద మనుషులెవరూ ఉండరు. కాని వీరి వారసులుంటారు. వారసులు తమ పెద్దల నుండి అందుకున్న అంశాల మీద చర్చించుకుంటారు. యువతరం నుండి సుఖమయ జీవన అంశాలనే కోరుకుంటారు. ఆస్థిపాస్తులు, చక్కని ఇళ్ళు కోరని వారసులుండరు. అయితే మనం వారసులకు అందించబోతున్న ఉమ్మడి ఆస్తి ఉష్ణగోళంగా మారిన భూగోళాన్ని. అందుకే మన వారసుల భద్రత దృష్ట్యా చక్కని చర్యలు చేపట్టాలన్నది ప్రపంచ ప్రజల ఆశయం. అందుకోసం ఎవరు ఏమి చేయాలన్నది ప్రపంచ నాయకులు చర్చిస్తున్న విషయం.

గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించాలని పలు వేదికల మీద చర్చలు జరిగాయి. ఏ దేశం ఏ మేరకు ఈ వాయువులను విడుదల చేస్తున్నది అనే అంశం గురించీ, వాటిని ఎంత శాతం తగ్గించాలనే అంశం మీదా చర్యలు చేపట్టాం. అయితే అందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు సిద్ధంగా లేవు. గ్రీన్ హౌస్ వాయువుల విడుదల తగ్గించడమంటే తమ సుఖమయ జీవనాన్ని కోల్పోవటమేనన్నది ఆ దేశాల నమ్మకం. అదే జరిగితే ప్రజలు అంగీకరించరనే అభిప్రాయంతో గ్రీన్ హౌస్ వాయువుల విడుదల తగ్గించకుండా ఉండేందుకు తగిన ఎత్తుగడలు వేస్తున్నారు.


Read 1 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 3   Next > >  



 
Advertisements
Advertisements
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Regional News
Hyderabad
Visakhapatnam
Vijayawada
Tirupati
Kurnool
Rajahmundry
Warangal
Anantapur
Eluru
Guntur
Kadapa
Kakinada
Karimnagar
Nellore
Nizamabad
Blogs
My Blogs
Popular
Active Blogs
Recently Created
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals
Discussion
Poetry
Govt and Politics
Offbeat and Jokes
Networking
My Friends
New Members
Invite a Friend
Galleries
My Photos
News
Cinema
Fashion
Sports
Travel
Videos
Top in Views
Top by Rank

(C) 2000-2013 TP Media India Ltd., All rights reserved.