|
|
Articles: TP Features | రేపు ఎవరికి తెల్లారేను? - Site Administrator
| |
(వై.ఎల్.ఆర్.మూర్తి)
ఇండియాలో అత్యధిక సంఖ్యలో కెమెరాలను ఎవరు అమ్ముతున్నారు?...
సోని లేదా కేనన్ లేదా నికాన్ అనేది మీ సమాధానం కావచ్చు. అయితే వాటిలో ఏదీ నిజం కాదు. అసలు కేమెరాను ఏనాడూ తయారు చేయని నోకియా విజేతగా నిలుస్తుంది. అసలు ఇండియాలో ఆ సంస్థ ప్రధానంగా వ్యాపారం చేస్తున్నది కెమెరాలతో కాదు. సెల్ ఫోన్లతో.
వట్టి కెమెరాల కన్నా సెల్ ఫోన్లలోనే అమర్చిన కెమెరాలే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. మరి కెమెరా స్థానాన్ని సెల్ ఫోన్ ఆక్రమించకుండా ఏది నిరోధిస్తున్నది? ఏదీ లేదు. సోనీలు, కేనన్ లు ఈ సంగతి గ్రహించి ఉంటాయనుకోవాలి.
ఇంకో ఉదాహరణ. ఇండియాలో సంగీత వ్యాపారంలో అగ్ర స్థానం ఎవరిది?...
హెచ్ఎంవి సరిగమ సంస్థ అనేది మీ ఊహా?..
అలా అయితే తప్పులో కాలేసినట్లే! ఇందుకు సరైన సమాధానం ఏమిటో తెలుసా!... ఎయిర్ టెల్! కాలర్ ట్యూన్లు (30 సెకన్ల పాటు వినిపిస్తాయి) విక్రయం ద్వారా ఎయిర్ టెల్ మ్యూజిక్ ఆల్బమ్ లు (గంటల కొద్దీ సాగేవి) అమ్మే మ్యూజిక్ కంపెనీల కన్నా అధికంగా సంపాదిస్తోంది.
అసలు ఆసక్తికరమైన విషయం ఏమంటే ఎయిర్ టెల్ సంగీత వ్యాపారంలో లేనే లేదు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఖాతాదారులు ఉన్న మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ ఎయిర్ టెల్. ఈ తరహా పోటీదారును కనిపెట్టడం కష్టం. ఓడించడం మరీ కష్టం. (మీరు అతనిని కనిపెట్టే లోపు అతను మరింత దూరం పోతాడు). అయితే, నోకియా, భారతి (ఎయిర్ టెల్ మాతృ సంస్థ) హమ్మయ్య అనుకుంటున్నాయని భావిస్తే మళ్ళీ మీరు పొరబడ్డారన్న మాటే.
స్మార్ట్ ఫోన్ బస్సును తాము దాదాపుగా మిస్సయ్యామని నోకియా ఒప్పుకున్నది. యాపిల్ కు చెందిన ఐఫోన్, గూగుల్ కు చెందిన ఆండ్రాయిడ్ లతో తమకు భవిష్యత్తు కష్టం కావచ్చునని నోకియా అంగీకరిస్తున్నది. అయితే, ఇంటర్నెట్ వ్యాపారం సాగించే గూగుల్ మొబైల్ ఫోన్ల వ్యాపారం చేస్తుందని అని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఈ పై ఉదాహరణలు చాలకపోతే మున్ముందు ఇంకా పెద్ద పెద్ద పోటీలే రాబోతున్నాయి. ఇవి మొబైల్ లేదా సంగీతం లేదా కెమెరా లేదా ఇమెయిల్స్ కు సంబంధించినవి అంతగా కావు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|