|
|
Articles: Poetry | ఏకాంత వాసం - mitra sailaja
| |
నాది ఏకాంత వాసం..
జ్ఞాపకాల అజ్ఞాతంలో ఎన్నాళ్ళ నుండో భద్రంగా
బయటకు కనబడనీయకుండా
భ్రమలో బతికేయడం నా విశ్వాసం..
జీవితం జీవిస్తోంది..
ాత్మీయత లేని అమ్మతనంలా
క్షణాల నీడల్ని దాటి రావాలనే
నా ప్రయత్నం కనబడుతోంది అజ్ఞాతంలా..
జననం..
ఒక జన్మకే పరిమితం అనుకుంటాం...
మరణించడానికే జన్మిస్తామని మరచిపోతాం..!
రెప్పపాటు కాలంలో
ఎన్నో ఆశయాలతో.. ఆశలతో
'నా' అన్న ఆనవాళ్ళను మరచిపోతాం..
కాదన్నవారినే అనుసరించడమే
జీవితం అనుకుంటాం..
అయినా..
అనుకోకుండా ఆనవాలు కోల్పోతున్న దృశ్యాలెన్నో..
కనబడకుండానే కనుమరుగైపోతున్న బంధాలెన్నో...
ఈ యాత్రకు అంతంలేదు..
ఈ చరిత్రకు ఆది లేదు..
అల్లంత దూరంలో ఆకాశం- భూమి కలిసినట్లున్న దృశ్యం
సృష్టి అంతా కలిసిపోయిందేమో అనిపిస్తుంది..
అలాంటప్పుడే..
నా కోసం నువ్వు నడిస్తే భౌతికత్వం..
నీ కోసం నేను నడిస్తే శాశ్వతత్వం..
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|