|
|
Articles: Recipes | టొమాటో ఇడ్లీ - Site Administrator
| |
కావల్సిన పదార్థాలు :
బొంబాయి రవ్వ : అరకిలో
టొమాటో గుజ్జు : చిన్న కప్పు
జీడిపప్పు : 25 గ్రాములు
ఆవాలు : అర టీ స్పూన్
మినపప్పు : టీ స్పూన్
సెనగపప్పు : టీ స్పూన్
కొత్తిమీర : ఒక కట్ట
పచ్చిమిర్చి : నాలుగు
పెరుగు : ఒక కప్పు
నెయ్యి : 3 టీ స్పూన్
ఉప్పు : రుచికి సరిపడ
వంట సోడా : చిటికెడు
తయారు చేయు విధానం : స్టవ్ మీద బాణిలి పెట్టి నెయ్యి వేసి పోపు గింజలు, జీడిపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత బొంబాయి రవ్వను కూడా దోరగా వేయించాలి. తాలింపు పెట్టుకున్న రవ్వలో పెరుగు, ఉప్పు, కట్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు టొమాటో గుజ్జు, వంట సోడా వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి పెరుగు చాలకపోతే కొంచెం నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. దీనిని రెండు గంటల సేపు నానబెట్టాలి. తర్వాత ఇడ్లీ రేకులకు నెయ్యి రాసినాక పిండి వేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఈ ఇడ్లీలలోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|