|
|
Articles: TP Features | థర్టీన్ ఫోబియా! - Site Administrator
| |
(లక్ష్మీకాంతరావు)
తీన్ తేరా... ఆట్ అటారా... అబ్రకదబ్ర... మాయం 13! మేథావుల తలలపై మూఢత్వం 'మేడ' కట్టింది. 13 అంకె అంటే మనోళ్ళకు భయం. ఇది విదేశాల నుంచి దిగుమతి అయిన మూఢనమ్మకం. ఈ భయం ఎంతగా ప్రబలిపోయిందంటే అబ్రకదబ్ర అనకుండానే కొద్ది మంది రియల్టర్లు, ఆర్కిటెక్టులు 13వ అంతస్తును మటుమాయం చేసేస్తున్నారు. పదమూడో అంతస్తు లేకుండానే 40 అంతస్తుల మేడలు కట్టేస్తున్నారు.
ఇది ఓ వెనకటి తరం కథ.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కొద్ది కాలానికి కొత్త దేశం అవతరించిందన్న స్ఫూర్తితో కాబోలు ప్రముఖ బిర్లా సంస్థ అధినేత ఘన్ శ్యామ్ దాస్ స్వస్థలం కోల్ కతాలో తమ గ్రూప్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ను స్థాపించనున్నట్లు ప్రకటించారు. నగరం నడిబొడ్డులో నిర్మాణం అయ్యే ఈ ఆధునిక భవనం చాలా ఎత్తుగా ఉంటుందని, దీని ముందు ఇతర ఆఫీసులు మరుగుజ్జులుగా కనిపిస్తాయని ఆయన చెప్పారు. నిర్మాణం 1958లో పూర్తయినప్పుడు బిర్లా భవనం నిజంగానే తలమానికంలా నిలచింది. అయితే, ఒక అవాంతరం తలెత్తింది. ఎత్తు విషయంలో అది 15 లెవెల్స్ ఉన్నది. అంటే ఆధునిక కొలమానం ప్రకారమైతే అది జి ప్లస్ 14 (గ్రౌండ్, పైన 14 అంతస్తులు). కాని, జిడి బిర్లాకు 12 అంకె ఇష్టం లేదు. హిందువులు అశుభ సూచకంగా పరిగణించే 'బార్వీ' లేదా 12వ సంతాప దినాన్ని గుర్తు చేస్తుంటుందని ఆయన భావించారు. అయితే, ఎక్కడ సమస్య ఉన్నదో అక్కడే పరిష్కారం ఉంటుందని పెద్దల సూక్తి కదా. ఈ సందర్భంలో 12వ అంతస్తును లేకుండా చేశారు. అంటే జి ప్లస్ 14 భవనం జి ప్లస్ 15గా మారిపోయింది. భవనంలోని ఎలివేటర్ లో గ్రౌండ్ ఫ్లోర్ 1 అంకెతో మొదలై, తరువాత 2, 3, 4 అలా 11 వరకు సాగిపోయింది. ఆ తదుపరి అంతస్తును 13గా పేర్కొన్నారు. ఆ తరువాత 14, 15, !6 అంకెలు వేశారు.
జిడి బిర్లా ఒక సంప్రదాయానికి నాంది పలకగా దేశవ్యాప్తంగా రియల్టర్లు, ఆర్కిటెక్ట్ లు దానిని కొనసాగించారు. ఆ వెటరన్ పారిశ్రామికవేత్తకు 12 అంకె భయం ఉండగా అత్యధిక సంఖ్యాకులకు 13 అంకె అంటే భయం. ఆ మూఢ విశ్వాసం ఉన్నవారి అవసరాలకు తగినట్లుగా ఎలివేటర్ ప్యానెల్స్, తలుపులు, నేమ్ ప్లేట్లపై ఆ అంకె కనిపించకుండా చేశారు. హేతువాదులకు ఇది విడ్డూరంగా కనిపించవచ్చు కాని చాలా మందికి 13 అంకె భయం ఉన్న కారణంగా తమ వద్ద అమ్ముడుపోకుండా ఉన్న ఫ్లాట్ ను వదిలించుకోవడానికి ఆ అంకె కనపడకుండా చేయడమే బిల్డర్లకు సులభ మార్గంగా గోచరిస్తున్నది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|