|
|
Articles: Poetry | చైతన్యమై - Site Administrator
| |
(డా.తిరునగరి)
నేను చిగురిస్తున్న వృక్షాన్ని
రేపు కుసుమించి ఫలిస్తాను
ఫలాలనందిస్తాను
ఆకలి తీరుస్తాను
నేను మొలుస్తున్న పంటచేనుని
రేపు ఏపుగా ఎదుగుతాను
గొలుసులతో వొంగుతాను
గరిసెలు నింపుతాను
నేను స్రవిస్తున్న సేద్యాన్ని
రేపు సంపదనౌతాను
స్వర్ణభారతాన్నవుతాను
నేను ఫలిస్తున్న స్వప్నాన్ని
రేపు చిరునవ్వునౌతాను
సంక్షేమాన్నవుతాను
సంరావాన్నవుతాను
నేను ఉదయిస్తున్న పద్యాన్ని
రేపు జాగృతినౌతాను
స్తబ్ధతను చీలుస్తాను
చైతన్యమై ప్రవహిస్తాను
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|