|
|
Articles: Devotion | సేవతోనే సద్గతి - Venkateswara Rao Madu
| |
(ఎమ్.ఎస్.ఎస్.శర్మ)
'నిన్ను నీవు కానలేనివాడివి జగత్తునేంచూడగలవు?
జగత్తును చూడలేని నీవు నిత్య సత్యాన్ని ఎలా కనుగొనగలవు?'
సృష్టికి మూలకారకుడు భగవంతుడు. భగవంతుడు సృష్టించిన భోన భోంతరాళాల్లో మానవుడు ఒక రేణువు మాత్రమే . సకల చరాచర సృష్టిలో మానవుడు ఒక భాగం మాత్రమే. సంతృప్తికై సృష్టిలోని ప్రతి అణువు ఏదోవిధంగా ఉపయోగపడుతుంది. కాని మానవుడేవిధంగా ఉపయోగపడుతున్నాడు?
మరొక రకంగా ఆలోచిద్దాం. మనష్యులందరూ కలిస్తే సంఘం. మానవుడు సంఘాన్ని విస్మరించి తనకు తానుగా ఒక్కడూ బ్రతకలేడు. కష్టంలో, సుఖంలో, పనిపాటలలో ఇలా అన్ని విషయాలలో తోడు లేకుండా, మరొకరిమీద ఆధారపడకుండా జీవించలేడు. ఇంత సహకారం సంఘాన్నించి తీసుకొని తన జీవితయాత్ర సాగిస్తున్నమనిషి, తన తరఫునుండి సంఘానికి తిరిగి ఏమిస్తున్నాడు? అంటే సంఘం తనకు సహకరిస్తోంది. కాని తను సంఘానికి ఏవిధంగా ఉపయోగపడుతున్నాడు?
సంఘం అంటే అందరూ కలిసి మెలిసి సహజీవనం చేయడమే. అందులోని ఒక భాగంగా మనం ఎల్లప్పుడూ పదిమందికి ఉపకరించే ఏ పనియైన వెనకాడకుండ చేయవలయును. అప్పుడు నీవు సంఘం పట్ల నీ విధ్వక్త ధర్మాన్ని నెరవేర్చినట్లు శ్రీ సాయినాధుడు మనకు ఆచరణలో చూపించిన విధంగా తోటి మానవునికి ఏదో విధంగా ఉపయోగపడగలిగితే అదే మనకు సద్గతి.
మానవ సేవయే మాధవ సేవ.
ఓం సాయిరాం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|