ప్రియమారా పలకరింపుల
నీ భాష్యానికి...
నా మనసు చేసే
ఆనంద పరవశలాస్యం
ఈ వ్యవహారాన్ని
అనుభూతించిన హృదయం
ఉప్పొంగే కడలి తరంగమై
స్వచ్ఛమైన స్పష్టత కలిగిన
స్నేహాన్ని పంచే
చెలీ...!
నీకేమివ్వగలను...?
కైమోడ్చి ఆ భగవంతునికి
'నీ పెదవులపై
చిరునవ్వుల రాణి
నాట్యమాడాలని
మరుజన్మ నీ ఒడిన
పసిపాపనై
ఊయలలూగాలనీ...'
భక్తికుసుమాల వేడుకోవటం తప్ప...!