|
|
Articles: Poetry | మట్టి మాధుర్యం - Site Administrator
| |
(అడిగోపుల వెంకటరత్నం)
దు:ఖానికి అర్థం ఉంది
నానార్ధాలు ఉన్నాయి
కవివర్యునిదో దు:ఖం
కర్షకునిదో దు:ఖం
బాల్యానిదో దు:ఖం
బాలెంతదో దు:ఖం!
ప్రేమకు అర్థం ఉంది
నానార్థాలు ఉన్నాయి
తండ్రిదో ప్రేమ
తనయుడిదో ప్రేమ
భోగిదో ప్రేమ
యోగిదో ప్రేమ!
ఉపచారానికి అర్థం ఉంది
నానార్థాలు ఉన్నాయి
ఆప్యాయతా స్పర్శ
కటాక్ష వీక్షణం
దాక్షిణ్య దీవెన
నిండారు అభయం!
దు:ఖానికి దు:ఖం ప్రత్యుత్తరం కాదు
కన్నీటికి కన్నీరు ఉపశమనం కాదు
కనుజీరకు కనుజీర ప్రతివచనం కాదు
చల్లని మాట సౌజన్యం
చల్లని చూపు సౌహార్దం
నా ఏడ్పు ఎదుట వాడి విక్రయం
నా నవ్వు ఎదుటి వాడి క్రయం!
ఒక మోదం
ఎన్ని జీవితాల ఆక్రందన
ఒక రోదన
ఎన్ని జీవితాల వేదన!
మాతృభూమికి అర్థం ఉంది
నానార్థాలు ఉన్నాయి
మట్టిని అన్ని భాషల్లో ఉచ్చరించాను
మాతృభాషలో మట్టి ఎంత మధురం!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|