|
|
Articles: Poetry | జీవన సత్యాలు - Mr. gauri shankar chemudupati
| |
పూల సుగంధాలు
మందపవనాలలోనే
పరిమళించాలని లేదు,
మనసున్న ప్రతిచోటా
గుబాళింపు వుంటుంది వెంటే!
అపుడపుడు
చిమ్మచీకటిలోనూ
చెలి కానవస్తుంది!
కళ్ళుంటే చూడు
పట్టపగలే చుక్కలు
కనువిందు చేస్తాయి!
మనసులో మలినం లేకుంటే
మాట సుమధురంగా వుంటుంది!
నేను నీవనే భేదభావన
మనసులోని శాంతికి విఘాతం!
ప్రేమ వొక భావన,
కామం వొక అనుభవం!
ప్రేమ భావన లేని కామం
చితిలో చెలరేగిన మంటల వెలుగు!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|